Tuesday, September 17, 2024
Homeసినిమాబన్నీ థియేటర్లో ప్రభాస్ 'ఆదిపురుష్‌'

బన్నీ థియేటర్లో ప్రభాస్ ‘ఆదిపురుష్‌’

మహేష్‌ బాబు ఏఎంబి అంటూ మల్టీప్లెక్స్ స్టార్ట్ చేయడం.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తెలిసిందే. ఇప్పుడు అల్లు అర్జున్ ఏఏఏ పేరుతో అమీర్ పేటలో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాడు. ఈ మల్టీప్లెక్స్ ను ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీతో ఓపెన్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని ఓంరౌత్ తెరకెక్కించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఈ భారీ చిత్రం బుకింగ్స్ అయితే లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఓపెన్ కాగా ఆదిపురుష్ 3డి వెర్షన్ లో అయితే సెన్సేషనల్ బుకింగ్స్ ని సెట్ చేస్తుంది. బుక్ మై షోలో అయితే.. ఆదిపురుష్ టికెట్స్ హాట్ కేకులులా అమ్ముడు పోయాయి. ఇక ఈ సినిమాతోనే ఓపెన్ అవుతున్న ఏఏఏ సినిమాస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా వీటికి మాస్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం నిమిషాల్లోనే బుకింగ్స్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. దీనిని బట్టి రెస్సాన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బుకింగ్స ట్రెండ్ చూస్తుంటే.. ఆదిపురుష్ ఫస్ట్ డే సరికొత్త రికార్డ్ సెట్ చేయడం ఖాయం అనిపిస్తుంది.

నిన్న బన్నీ థియేటర్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అంతే… సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఏఎంబి సినిమాస్ అంటే క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ క్రేజ్ ను బన్నీ ఏఏఏ సినిమాస్ దక్కించుకోవడం ఖాయం అనిపిస్తుంది. అలాగే ఐమ్యాక్స్ కు ఆ క్రేజ్ కాస్త తగ్గే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బన్నీ ఏఏఏ సినిమాస్ అంటూ మల్టీఫ్లెక్స్ స్టార్ట్ చేసి ఐమ్యాక్స్, ఏఎంబి సినిమాస్ కి టెన్షన్ క్రియేట్ చేశాడు అని టాక్ వినిపిస్తుంది. మరి.. భవిష్యత్ లో ఏఏఏ సినిమాస్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్