Saturday, January 18, 2025
Homeసినిమాచ‌ర‌ణ్ పాత్ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసుంటే?

చ‌ర‌ణ్ పాత్ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసుంటే?

Cherry-Kalyan: చిరు, చెర్రీ క‌లిసి న‌టించిన భారీ చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మెగా అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తోన్న ఆచార్య ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో చిరంజీవి ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. ఆచార్య సినిమాలో చ‌ర‌ణ్ పోషించిన సిద్ధ పాత్ర కోసం ముందుగా మ‌హేష్ బాబును అనుకున్నారు క‌దా.. ఆత‌ర్వాత మ‌ళ్లీ ఎందుకు మార్చాల్సి వ‌చ్చింది అని అడిగితే.. మ‌హేష్ బాబు పేరును మీడియానే ప్ర‌చారం చేసింది కానీ.. ఫ‌స్ట్ నుంచి చ‌ర‌ణే అనుకున్నాం అన్నారు.

ఇక చ‌ర‌ణ్ కాకుండా ఆ పాత్ర‌ను ఎవ‌రు చేసుంటే బాగుంటుంది అని అడిగితే.. ఎవ‌రు చేసినా బాగుంటుంది. చ‌ర‌ణ్ కి ఈ సినిమా చేయ‌డం కుద‌ర‌క‌పోతే.. పవన్ కళ్యాణ్ తో ఆ పాత్ర‌ను చేయించేవాళ్లం. చ‌ర‌ణ్ చేస్తే.. ఎలాంటి అనుభూతికి లోన‌య్యానో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసినా అదే అనుభూతికి లోన‌య్యేవాడిని అని చెప్పారు మెగాస్టార్. ఇక ఈ సినిమాలో న‌టించేట‌ప్పుడు టెన్ష‌న్ గా ఎప్పుడైనా ఫీల‌య్యారా అని అడిగితే.. చ‌ర‌ణ్ తో డ్యాన్స్ చేయ‌డానికి టెన్ష‌న్ పడ్డాన‌ని చెప్పారు. తండ్రీకొడుకులు చిరు, చెర్రీ క‌లిసి న‌టించిన ఆచార్య సినిమా పై అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి… బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏ స్థాయి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Also Read : అంతా అయిన తరువాత  కాజల్ లేదంటారేంటండీ!

RELATED ARTICLES

Most Popular

న్యూస్