Friday, March 20, 2026
HomeTrending Newsడైమండ్ విలువైనది: అలీ కౌంటర్

డైమండ్ విలువైనది: అలీ కౌంటర్

సిఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా, ఎవరిపైనైనా పోటీకి సిద్ధమని సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ స్పష్టం చేశారు. సినిమా వేరు, రాజకీయం వేరు, ఫ్రెండ్షిప్ వేరు అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో విమర్శకు ప్రతివిమర్శ తప్పకుండా ఉంటుందన్నారు. ఒకే ఇంట్లో ఉన్న అందరూ ఒక పార్టీకి ఓటు వేయాలన్న నియమం ఏమీ లేదన్నారు.  నగరిలో వరుసగా  మూడోసారి ఆర్కే రోజా ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నగరిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆలీ ఈ వ్యాఖ్యలు చేశారు. రోజాను డైమండ్ రాణి అంటూ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై కూడా అలీ స్పందించారు.  డైమండ్ చాలా విలువైనదని, పవర్ ఫుల్ అని, ఆమె కూడా ఎక్కడా తగ్గేదే లేదని, ఫైర్ బ్రాండ్ అని అభివర్ణించారు.

ఏపీకి ఎవరు మేలు చేశారో ప్రజలకు తెలుసనీ, అందుకే వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని, సిఎం జగన్ చెబుతున్నట్లు 175కి 175 స్థానాలు తామే కైవసం చేసుకుంటామన్న విశ్వాసం ఉందన్నారు. సంక్షేమ  పథకాలు తమకు అందాయని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular