Sunday, January 19, 2025
Homeసినిమాఐదు భాషల్లో విడుదలవుతున్న  ‘ఇక్షు’

ఐదు భాషల్లో విడుదలవుతున్న  ‘ఇక్షు’

పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకం పై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా ఋషిక దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇక్షు. హనుమంతురావు నాయుడు అండ్ డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో వస్తున్న ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న “ఇక్షు” ప్రోమోకు సినీ పెద్దల నుండి, ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది.

దర్శకురాలు ఋషిక మాట్లాడుతూ  “లేడీ డైరెక్టర్ అని చూడకుండా చాలా మంది హెల్ప్ చేశారు. హీరో రామ్ అగ్నివేశ్ చాలా చక్కగా నటించాడు. మా సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసిన ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి,  నాకు అవకాశమిచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు” అని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్