Sunday, January 19, 2025
HomeTrending Newsమళ్ళీ విజృంభిస్తున్న కరోనా

మళ్ళీ విజృంభిస్తున్న కరోనా

జగిత్యాల జిల్లా మల్యాల  మండలంలోని మద్దుట్ల లో ఈరోజు 100 కరోన టెస్టులు చేయగా 32 కేసులు వచ్చినట్లు సమాచారం. గ్రామంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేలో అనేక మంది నీరసంగా ఉండటం ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల దృష్టికి వచ్చింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించగా ప్రత్యెక వైద్య శిభిరం మద్దుట్లలో నిర్వహించారు. యాంటిజెన్ ర్యాపిడ్ పరీక్షలు చేయగా వంద మందిలో ముప్పై మందికి కేరోన లక్షణాలు ఉన్నాయి.  గ్రామంలో సుమారు వెయ్యి కుటుంబాలు ఉన్నాయి. భయాందోళన చెందిన కొందరు జగిత్యాల, కరీంనగర్ తదితర పట్టణాలకు తరలివెళ్ళారు. వెళ్ళిన వారిలో ఎంతమందికి కోవిడ్ లక్షణాలు ఉన్నాయో చెప్పలేమని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు మద్దుట్ల లో ఇంకా  కొనసాగుతున్న టెస్టులు. మల్యాల మండలంలోని మరికొన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

సెకండ్ వేవ్ వచ్చే సమయంలో కూడా జగిత్యాలలోనే అత్యధిక కేసులు బయట పడ్డాయి. ఓ పెళ్లి బృందం అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడటంతో పరీక్షలు చేయగా అప్పుడు కరోన  అని తేలింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్