Sunday, January 19, 2025
HomeTrending NewsHMDA: బాచుపల్లి ప్లాట్ లకు భలే డిమాండ్

HMDA: బాచుపల్లి ప్లాట్ లకు భలే డిమాండ్

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్అర్)కు అతి సమీపంలో బాచుపల్లి వద్ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) రూపొందించిన లేఅవుట్ ప్లాట్లకు మంచి డిమాండ్ నెలకొంది. బాచుపల్లి లేఅవుట్ లో రెండో దిశలో 133 ప్లాట్లను అన్ లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండిఏ ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం హెచ్ఎండిఏ బాచుపల్లి లేఅవుట్ లో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి విశేష ఆదరణ లభించింది.

ప్రీ బిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, మల్కాజిగిరి ఆర్డిఓ మల్లయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ హుస్సేన్ లతోపాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం ఎస్ టి సి ప్రతినిధులు హాజరై బాచుపల్లి లేఅవుట్ ప్రాధాన్యతను వివరించారు. హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య మాట్లాడుతూ వివాదాలకు తావు లేకుండా హెచ్ఎండిఏ రూపొందించిన లేఔట్లకు ప్రజానీకం నుంచి విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు బాచుపల్లి లేఅవుట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆన్ లైన్ వేలం ప్రక్రియలో ఏవిధంగా పాల్గొనాలనే అంశాలను వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్