Thursday, March 19, 2026
HomeTrending Newsర్యాగింగ్ విష‌యంలో క‌ఠినంగా ఉండండి: మంత్రి ఆదేశం

ర్యాగింగ్ విష‌యంలో క‌ఠినంగా ఉండండి: మంత్రి ఆదేశం

ర్యాగింగ్ విష‌యంలో రాష్ట్రంలోని అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పష్టం చేశారు. ఇటీవల వరంగల్ ఎంజిఎం కాలేజీలో మెడికో ఆత్మ‌హ్య‌త ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు మెడిక‌ల్ క‌ళాశాల‌ల ప్రిన్సిప‌ల్స్ తో  మంత్రి సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. మంగ‌ళ‌గిరిలోని వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ వినోద్ కుమార్, డాక్ట‌ర్‌ వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీ వీసీ బాబ్జి, రిజిస్ట్రార్ రాధికారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ర‌జిని మాట్లాడుతూ ర్యాగింగ్ భూతం విష‌యంలో అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌లు క‌ఠినంగా ఉండాల‌ని స్ప‌ష్టంచేశారు. మెడికోల‌పై ఎక్క‌డా, ఎలాంటి వేధింపులు ఉండ‌టానికి వీల్లేద‌న్నారు. ర్యాగింగ్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆయా క‌ళాశాల‌లు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను ఆమె సూచించారు.

Also Read : ప్రీతి దోషులను కఠినంగా శిక్షిస్తాం – మంత్రి ఎర్రబెల్లి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular