Saturday, November 23, 2024
HomeTrending NewsRojgar Mela: ఉద్యోగ కల్పనకు కేంద్రం కృషి : కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

Rojgar Mela: ఉద్యోగ కల్పనకు కేంద్రం కృషి : కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

కేంద్రప్రభుత్వం ఓవైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే.. మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్​ రెడ్డ అన్నారు. సికింద్రాబాద్​లోని లోయర్​ట్యాంక్​బండ్​లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్​ నిర్వహించిన రోజ్​గార్​మేళాకు ఆయన హాజరయ్యారు. 9 జాతీయ బ్యాంక్ లు, డీఆర్​డీవో, ఇండియన్ రైల్వే, డిఫెన్స్, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సహా మొత్తం 22 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 470 మందికి కేంద్ర మంత్రి అపాయింట్​మెంట్ లెటర్స్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కిషన్​ రెడ్డి మాట్లాడారు

ప్రధాని నరేంద్ర మోడీ .. క్యాబినెట్​మీటింగ్​ పెట్టి అన్ని శాఖల ఖాళీలను గుర్తించాలని కోరారు. ఖాళీల లెక్కలన్నీ తీయగా.. దాదాపు 10 లక్షల పోస్టులు ఉన్నట్టుగా గుర్తించారు. 10 లక్షల ఖాళీలను ఏకకాలంలో రిక్రూట్​చేయడం సాధ్యం కాదు కాబట్టి ప్రధాన మంత్రి.. నెలకు 70 వేల చొప్పున భర్తీ చేస్తున్నారు. ఈమేరకు రోజ్​గార్​ మేళా నిర్వహిస్తూ.. స్వయంగా ప్రధాని ఉద్యోగార్థులతో మాట్లాడుతున్నారు. 22 అక్టోబర్ 2022 నాడు దేశ యువతకు దీపావళి కానుకగా ‘రోజ్ గార్ మేళా’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇది 6వ రోజ్‌గార్ మేళా కాగా.. నేటితో కలుపుకుని 4 లక్షల 30 వేలకు పైగా మంది యువకులకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏకకాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి. యూత్​ పాపులేషన్​లో భారతదేశం నెంబర్​ వన్​.. అనేక అంతర్జాతీయ, సాఫ్ట్​వేర్​ సంస్థలకు సీఈవోలు భారతీయులు..

యువత మేధస్సు ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేలా భారత్​ తయారు కానుంది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతలోని పారిశ్రామిక నైపుణ్యాన్ని.. వారు ఉపాధి కోసం వెతికే స్థితి నుంచి ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. 2047 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేండ్లు పూర్తవుతుంది. అప్పటి వరకు మన యువత వారి శక్తి యుక్తులను ఉపయోగించి భారత్​ను ప్రపంచంలోనే అగ్రగ్రామిగా నిలబెట్టాలి. భారత్​ ఈరోజు ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం కారణంగా.. దేశంలో మొత్తం వాణిజ్య ఎగుమతులు 2021-22లో 418 బిలియన్ డాలర్లు. నెలకు దాదాపు 35 బిలియన్ డాలర్ల వాణిజ్య ఎగుమతులు 2021-22లో నమోదయ్యాయి. ఇవి కాకుండా సేవల ఎగుమతుల దాదాపు 250 బిలియన్ డాలర్లకు పైగానే నమోదయ్యాయి. ఇవన్నీ కేంద్రం తీసుకొచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2014కు ముందు దేశంలో 74 విమానాశ్రయాలుంటే ఇవాళ అవి 150కి చేరాయి. 2025 నాటికి 225 విమానాశ్రయాలు సిద్ధం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. ఉద్యోగాలు వచ్చిన వారు అంకితభావంతో దేశం కోసం పని చేయాలి. తల్లిదండ్రులను మరిచిపోవద్దు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్