Saturday, March 14, 2026
Homeసినిమా‘లైగ‌ర్’ లో సాంగ్ పాడిన షణ్ముఖ ప్రియ

‘లైగ‌ర్’ లో సాంగ్ పాడిన షణ్ముఖ ప్రియ

తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ప్ర‌ముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్టులలో ఒక‌రు. ఇటీవ‌ల ఆమె అభిమాన న‌టుడు విజయ్ దేవరకొండ తనకు శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఆమె ఒకర‌క‌మైన సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. ఆ స‌మ‌యంలో తన తదుపరి చిత్రంలో పాడే అవ‌కాశం ఇస్తాన‌ని హామీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు విజ‌య్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న పూరిజ‌గ‌న్నాధ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న‌ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘లైగర్‌’లో షణ్ముఖ ప్రియతో ఒక పాట పాడించ‌డం ద్వారా త‌న వాగ్ధానాన్ని నెరవేర్చుకున్నారు విజ‌య్. అలాగే షణ్ముఖ ప్రియ కల కూడా సాకారం అయ్యింది.

అంతే కాకుండా షణ్ముఖ ప్రియ, ఆమె తల్లిని త‌న నివాసంలో క‌లిశారు విజయ్‌. ఈ సంద‌ర్భంగా విజయ్ దేవరకొండ తల్లి షణ్ముఖ ప్రియను సత్కరించారు. అలాగే ఆమెకు కొన్ని బహుమతులు అందజేశారు. మేము నీ పాటను సినిమాలో ఉంచుతాము. అది ఒక చక్కని పాట. దానిని వినడానికి ఎదురు చూస్తున్నాను. వచ్చే వారం వింటానని అనుకుంటున్నాను. తొంద‌ర‌గా ఫైన‌ల్ మిక్సింగ్‌కి పంప‌మ‌ని వారిని అడుగుతాను ”అని విజయ్ దేవరకొండ షణ్ముఖ ప్రియకు చెప్పారు.

బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరో యిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మోహతా నిర్మిస్తున్నారు. విలక్షణ నటి రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రధారి. ‘లైగర్‌’ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular