Saturday, March 14, 2026
Homeసినిమాఅమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పై 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' 

అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పై ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ 

బాలీవుడ్ నుంచి ఈమధ్య కాలంలో భారీ వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఎక్కువగా వారు యాక్షన్ జోనర్లోని కథలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా పోలీస్ కథలతో ముందుకు వెళుతున్నారు. బాలీవుడ్ సినిమాల్లోని భారీ యాక్షన్ సీక్వెన్స్ కి ఎంతమాత్రం తగ్గకుండా ఈ సిరీస్ లు ఉంటున్నాయి. బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న స్టార్స్ ఈ సిరీస్ లలో ప్రధానమైన .. కీలకమైన పాత్రలను పోషిస్తూ అంచనాలు పెంచుతున్నారు.

అలా భారీతనమే ప్రధానమైన ఆకర్షణగా రూపొందిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సిద్ధార్థ్ మల్హోత్రా .. వివేక్ ఒబెరాయ్ … శిల్పా శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించారు. లిజో జార్జ్ – చేతస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సిరీస్ కోసం  చాలా రోజులుగా చాలామంది వెయిట్ చేస్తున్నారు. కాస్త మసాలా జోడించిన యాక్షన్ సిరీస్ ను ఇష్టపడేవారు ఈ సిరీస్ చూడొచ్చు.

ఢిల్లీ నగరంలోని ప్రధానమైన కూడళ్లలో .. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో  ఒకే రోజున వరుస బాంబు పేలుళ్లు జరుగుతాయి. ఢిల్లీ పోలీసులు ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి వెళ్ళేలోగా జరగాల్సిన అనర్థం జరిగిపోతూ ఉంటుంది. ఆ పేలుళ్లకు పాల్పడినదెవరు? అది తెలుసుకున్న ఢిల్లీ పోలీస్ ఫోర్స్ ఏం చేస్తుంది? అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.యాక్షన్ బ్లాక్స్ ను డిజైన్ చేసిన తీరు ఈ సిరీస్ కి హైలైట్ అనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular