Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్జస్వంత్ రెడ్డి వీర మరణం

జస్వంత్ రెడ్డి వీర మరణం

జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో సైనికుడు మరుప్రోలు జస్వంత్ రెడ్డి (23) వీరమరణం పొందారు.  జస్వంత్ స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం. రాజౌరి జిల్లాలోని సుందర్ బాణి సెక్టార్, దడ్డా గ్రామం సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు. వీరిని అడ్డుకునే క్రమంలో మన సైనిక దళాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో జస్వంత్ రెడ్డి తో పాటు సుబేదార్ శ్రీజిత్ అసువులు బాశారు. మరో సైనికుడు గాయపడ్డారు.

ఈ ఎన్ కౌంటర్ లో మన సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. చనిపోయిన ఉగ్గ్రవాదుల నుంచి రెండు ఏకే 47 తుపాకులతో పాటు పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు లభించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్