Thursday, March 19, 2026
HomeTrending News50 కోట్లతో ఇందూరు కళాభారతి

50 కోట్లతో ఇందూరు కళాభారతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన “కళాభారతి” ఆడిటోరియం తుది నమూనాను గురువారం నాడు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ఇందూరు వైభవాన్ని చాటేలా,ఇక్కడి సాంస్కృతిక,సాంప్రదాయాలు ఉట్టి పడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతుందని మంత్రి తెలిపారు. 50 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే ఈ కళాభారతి ఆడిటోరియంకు ఈనెల 28 నాడు ఉదయం 11 గంటలకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి శ్రీ కెటిఆర్ గారి చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన,ప్రజాప్రతినిధుల పక్షాన ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి,మంత్రి కెటిఆర్ గారికి మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular