Sunday, January 19, 2025
Homeసినిమాలాల్ సింగ్ చ‌డ్డాకు చైత‌న్య నో చెప్పాడా?

లాల్ సింగ్ చ‌డ్డాకు చైత‌న్య నో చెప్పాడా?

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చ‌డ్డా. ఇందులో అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్ జంట‌గా న‌టించారు. ఈ మూవీని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తుండ‌డం.. నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ కావ‌డం.. నాగార్జున ప్ర‌మోష‌న్స్ చేస్తుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ క్రేజీ మూవీ ఆగ‌ష్టు 11న తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

 ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో నాగ‌చైత‌న్య ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కీ ఏం చెప్పారంటే.. నిజానికి తనకు గత కొన్నాళ్లుగా కొన్ని బాలీవుడ్ మూవీ అవకాశాలు వస్తూనే ఉన్నాయని కానీ.. నో చెప్పానన్నాడు. అంతే కాకుండా లాల్ సింగ్ చ‌డ్డా సినిమాకి కూడా నో చెప్పాడ‌ట చైత‌న్య‌.

కార‌ణం ఏంటంటే… చైత‌న్య‌ పుట్టి పెరిగిందంతా చెన్నై కావడం, అనంతరం హైదరాబాద్ కి షిఫ్ట్ కావడంతో తనకు హిందీ పెద్దగా అలవాటు కాలేదు. హిందీ భాషపై పెద్దగా పట్టు లేక‌పోవ‌డంతో వచ్చిన బాలీవుడ్ ఛాన్స్ లు అన్నిటికీ నో చెప్పానన్నారు. అలానే లాల్ సింగ్ చడ్డా విషయంలో కూడా తాను మొదట నో చెప్పానని, అయితే ఇందులో బాలరాజు క్యారెక్టర్ సౌత్ నుండి నార్త్ వెళ్లిన ఆర్మీ వ్యక్తి ఇతివృత్తంతో సాగుతుందని, అలానే కథలో భాగంగా కొన్ని సీన్స్ లో తెలుగు పదాలు డైలాగ్స్ గా వస్తాయని చెప్పడంతో ఒప్పుకున్నాన‌ని చైత‌న్య బ‌య‌ట‌పెట్టారు. మ‌రి.. లాల్ సింగ్ చ‌డ్డా చైతుకి ఎలాంటి విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Also Read లాల్ సింగ్ చ‌డ్డాపై ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేసిన చైతూ

RELATED ARTICLES

Most Popular

న్యూస్