Thursday, January 23, 2025
HomeTrending NewsFishermen: చెరువుల వద్ద దళారులను తొలగించాలి - జీవన్ రెడ్డి

Fishermen: చెరువుల వద్ద దళారులను తొలగించాలి – జీవన్ రెడ్డి

తెల్ల రేషన్ కార్డుదారులందరికి భీమా కల్పించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మత్స్యకారులకు మధ్య దళారులను తొలగించాలన్నారు. చేప పిల్లల పెంపకం కోసం నేరుగా మత్స్య కారులకే నగదు అందజేయాలన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం మత్స్య కారులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డిని మత్స్యకారులు కలిసి అభిమానం తో చేపలు అందజేసి, శాలువాతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ…

ఇటీవల వరదలకు రైతులతోపాటు మత్స్య కార్మికులు తీవ్రంగా నష్ట పోయారు. వరదలకు చెరువుల మత్తల్లు దుముకడంతో చేపలు కిందికి వెళ్లి పోవడంతో టమాటా రు.200లకు కిలో అయితే చేపలు రు.100 రుపాయలకు అమ్ముకున్నారు. రోల్లవాగు ప్రాజెక్ట్ కు గండి పడి కొట్లాడి విలువైన చేపలు కొట్టుకు పోయాయి. వందలాది మంది మత్స్య కార్మికులు ఉపాధి కోల్పోయారు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదు. వరదలకు నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. చేప పిల్లలు ఆలస్యంగా పంపిణీ చేస్తుండడంతో చేపలు పెరగడం లేదని, గిట్టుబాటు కాలేదన్నారు.

చేప పిల్లలు పెంచేందుకు చెరువుల సామర్థ్యాన్ని బట్టి నగదు మత్స్య కార్మికులకే ఇవ్వాలని జీవన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. జగిత్యాల ధర్మ సముద్రం చెరువులో నామినేషన్ పద్దతి లో మత్స్య కార్మికులకు అప్పగించాం. రాయికల్ పెద్ద చెరువు ను మత్స్య కార్మికులకు అప్పగించేలా చర్యలు తీసుకున్నాం. కులవృత్తికి సంభందించి రైతులకు కల్పించే ఆర్థిక సహాయం సమాజంలో కుల వృత్తుల పై ఆధార పడిన నిరుపేద లందరికీ భీమా వర్తింపజేయాలి. మత్స్య కారులు వృత్తిలో మృతి చెందితే నే భీమా ఇస్తుండటంతో ఇతర కారణాలతో కుటుంబ పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది.

కార్యక్రమంలో మత్స్య శాఖ విభాగం జిల్లా అధ్యక్షుడు తోపారాపు రజనీకాంత్, గంగ పుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు దేశవేని రాజేష్, కాంగ్రెస్ మత్స్య శాఖ విభాగం రాష్ట్ర కార్యదర్శి రుత్త నారాయణ, రాయికల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తోపరాపు రవీందర్, గోవిందారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తోకల నర్సయ్య, పసునురు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ప్రభాకర్, రాయికల్ మండలం మత్స్య శాఖ విభాగం అద్యక్షుడు పల్లి కొండ రమేష్, బీర్ పూర్ మండల కాంగ్రెస్ మత్స్య శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, వెల్గటూర్ మత్స్య శాఖ కాంగ్రెస్ అద్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, చేర్ల కొండాపూర్ గ్రామ అద్యక్షుడు రాజేందర్, రాజేశం, శ్రీహరి, శివ,ఎలుకబావి వాడ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కండ్లపెల్లి రాజయ్య, భీమయ్య, కిరణ్, ఉమ్మడి కరీంనగర్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ వెంపేట గంగాధర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్