Wednesday, June 26, 2024
HomeTrending NewsBabu: మనిద్దరి అనుభవం ఒకటే: డాక్టర్ తో బాబు

Babu: మనిద్దరి అనుభవం ఒకటే: డాక్టర్ తో బాబు

సమాజంలో జరుగుతోన్న మంచి చెడులను విశ్లేషించడంలో  కులం, మతం, ప్రాంతం, బంధుత్వం అనే  అడ్డంకులు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.  వీటిపై కూడా చర్చించాల్సిన అవసరం వచ్చింది కాబట్టే ఈ విషయం చెప్పాల్సి వచ్చిందన్నారు.  రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకం, ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తున్న విధానం, మేధావులు కూడా మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. ప్రజా చైతన్యమే మార్గామనిమ్ ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి పరినామనాలను ఎదుర్కోగలుగుతామని స్పష్టం చేశారు.  కోనసీమ జిల్లాల్లో ప్రయతిస్తున్న చంద్రబాబు అమలాపురంలో ‘ ప్రగతి కోసం ప్రజా వేదిక’ కార్యక్రమం ద్వారా వివిధ వర్గాలకు చెందిన మేధావులు,  విద్యావంతులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ  .. అనంతపురం తాగునీటి సమస్య పరిష్కారానికి నాడు సత్య సాయిబాబా చొరవ, సూచన మేరకు వారు భక్తుల నంచి విరాళాలు సేకరించి ప్రాజేకు నిర్మించి తనకు అప్పజేప్పారని, తానూ ఎల్ అండ్ టి ద్వారా మొన్నటి వరకూ ఈ మంచినీటి సరఫరా కొనసాగించామని… కానీ  జగన్ ప్రభుత్వం ఆ కంట్రాక్టర్ కు డబ్బులు ఇవ్వకుండా దాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మనం చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో ముందుకు కొనసాగించే వ్యవస్థ కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా  ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. విష్ణుమూర్తి అనే ఓ  డాక్టర్ మాట్లాడుతూ తాను 43 ఏళ్ళ నుంచి ఇక్కడ పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పగానే బాబు జోక్యం చేసుకొని ‘ అయితే నా అంత సర్వీస్ ఉంది మీకు, రాజకీయాల్లో ఎంత అనుభవం ఉందో మీకు కూడా అంత ఉంది’ అని చమత్కరించారు. ‘నా భార్య ఎస్వీ యూనివర్సిటీ లో మీతో సహా విద్యార్ధిని’ అని కూడా ఆయన బాబుతో అన్నారు. ఆమె ఏ బ్రాంచి లో చదివిందీ బాబు అడిగి తెలుసుకున్నారు. తాము స్టూడెంట్ లీడర్ గా ఎంత గొడవ చేసేవాల్లమో ఆమెను అడిగితే చెబుతారు’ అంటూ బాబు బదులిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్