Saturday, November 23, 2024
HomeTrending Newsచిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం టూర్

చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం టూర్

Central Team Visit:
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయి లో పరిశీలిస్తున్న కేంద్ర బృందం వరుసగా రెండోరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించింది. శనివారం గంగవరం మండలం, మామడుగు గ్రామంలో జరిగిన నీట మునిగిన పంటలను సందరించారు. ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ సభ్యులు అభేకుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ఆర్ధిక శక అధికారులు ఈ బృందంలో ఉన్నారు.

వరి పంట కోత దశలో  ఉoడగా భారీగా కురిసిన వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బ తిన్నదని రైతులు తెలపగా.. ఉద్యాన పంటలైన టమాటా,  బీన్స్, క్యాబేజీ, బంగాళాదుంప, కాలీఫ్లవర్ ఇతర పంటలు దెబ్బతిన్నాయని,  మామడుగు గ్రామంలో మొత్తం 245.50 ఎకరాల్లో 267 మంది రైతులకు పంట నష్టం జరిగిందని అధి కారులు వివరించారు. కనికల్ల చెరువు  ఆయ కట్టు కింద 172 ఎకరాలలో సాగుఅవుతున్న వరి పంట. నీట మునిగి కొట్టుకు పోగా, ఆ ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు

ఈ పర్యటనలో కేంద్ర బృందం సభ్యులు వెంట మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ  జె.డి లు దొరసాని, వెంకట్రావ్, ఉద్యాన వన శాఖ డి డి శ్రీనివాసులు, గంగవరం తహశీల్దార్ మురళి, ఎంపీడీవో భాస్కర్, ఇతర అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్