Saturday, January 18, 2025
Homeసినిమామహేష్‌ - త్రివిక్రమ్ మూవీ స్టోరీ ఇదేనా.?

మహేష్‌ – త్రివిక్రమ్ మూవీ స్టోరీ ఇదేనా.?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఇది భారీ యాక్షనా..? ఫ్యాక్షనా..? లేక ఫ్యామిలీ ఎంటర్ టైనరా..? ఇది ఏ తరహా చిత్రం.? అని అభిమానులు ఆరా తీయడం మొదలెట్టారు.. అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజా వార్త ఏంటంటే.. మహేష్ తో త్రివిక్రమ్ చేయనున్న మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే… ఇందులో మహేష్‌ ఓ క్రిమినల్. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఓ ఇంట్లోకి మారు పేరుతో ఎంట్రీ ఇస్తాడు.

ఆ తర్వాత తెలిసేదేమంటే అతను క్రిమినల్ కాదు.. అండర్ కవర్ పోలీస్ అని. ఈ స్టోరీని త్రివిక్రమ్.. మహేష్ కి చెబితే ఓకే చెప్పాడట. అయితే.. హీరో ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్ ట్విస్ట్.. క్లైమాక్స్.. రాసేశారట కానీ.. పూర్తి స్ధాయిలో స్ర్కిప్ట్ ఇంకా రెడీ కాలేదని వార్తలు వస్తున్నాయి. మహేష్‌ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి. అందుచేత త్రివిక్రమ్ కి ఇంకా చాలా టైమ్ ఉంది. ఈ చిత్రాన్ని మే 31 ప్రారంభించాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు.

తాజా సమాచారం ప్రకారం.. ఆగష్టు నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. ప్రచారంలో ఉన్న ఈ మూవీ స్టోరీ వింటుంటే.. అతడు, పోకిరి గుర్తొస్తున్నాయి. మరి.. మాటల మాంత్రికుడు ఏ మ్యాజిక్ చేస్తారో..? మహేష్ బాబును సరికొత్తగా ఎలా చూపించబోతున్నారో.. చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్