Sunday, January 19, 2025
Homeసినిమాప్రాజెక్ట్ కే గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

ప్రాజెక్ట్ కే గురించి ఇంట్రస్టింగ్ న్యూస్

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. ఇందులో ప్రభాస్ కు జంటగా దీపికా పడుకునే నటిస్తుంటే.. దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తుంది. బిగ్ బి అమితాబ్, కమల్ హాసన్ కూడా నటిస్తుండడం విశేఃషం. ఈ నెల 20న ఈ ప్రాజెక్ట్ కే టైటిల్ ఏంటి..? రిలీజ్ ఎప్పుడు.? అనేది ప్రకటించనున్నారు. కమల్ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి విలన్ గా నటిస్తున్నారని ప్రచారం మొదలైంది. ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో కమల్ పాత్ర వస్తుందని.. సెకండ్ పార్ట్ లో చాలా ఎక్కువ సేపు కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఏంటంటే.. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని టాక్. ఈ గెస్ట్ రోల్ లో కూడా ఓ ప్రముఖ హీరో కనిపించబోతునట్లు ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఈ పాత్ర కథను మలుపు తిప్పుతుందని అంటున్నారు. ఇంతకీ ప్రాజెక్ట్‌ కే సినిమాలో కనిపించబోతున్న ఆ అతిధి పాత్ర పోషించే హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రచారంలో ఉన్నది వాస్తవమేనా కాదా అనేది కూడా తెలియాల్సివుంది. ఇప్పటికే ఈ సినిమా 90% షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక బ్యాలెన్స్ షూటింగ్ పార్ట్ కూడా కొన్ని వారాల్లో పూర్తి చేయనున్నారు.

మరో వైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఏకకాలంలో జరుగుతోంది. టీమ్ పెట్టుకున్న టైమ్‌ లైన్ ప్రకారం, విఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్ మరియు డిఐ తో సహా మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అక్టోబర్‌లో పూర్తి కానున్నాయి. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పతాకం పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మరి.. ఈ పాన్ వరల్డ్ మూవీ ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్