Friday, March 20, 2026
HomeTrending Newsఅసని ఎఫెక్ట్: ఇంటర్ పరీక్ష వాయిదా

అసని ఎఫెక్ట్: ఇంటర్ పరీక్ష వాయిదా

Exams postponed: అసని తుపాను కారణంగా నేడు (బుధవారం, మే 11న) జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తూ ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పరీక్షలను ఈ నెల 25న నిర్వహిస్తామని అధికారులు తెలియజేశారు. తొలుత నిర్ణయించిన ప్రకారం రేపు ఇంటర్ మొదటి సంవత్సరం మాథ్స్ పేపర్-1; బోటనీ-1; సివిక్స్-1పరీక్షలు జరగాల్సి ఉంది.

అయితే అసని తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు సిఎం జగన్ కూడా రేపు బుధవారం కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో  ‘మత్స్యకార భరోసా’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది, తుఫాన్ కారణంగా దీన్ని కూడా ఈనెల 13వ తేదీకి వాయిదా వేశారు. 13న జరగాల్సిన కేబినేట్ భేటీని ఒకరోజు ముందుగా అంటే 12న నిర్వహిస్తారు. మంత్రివర్గ సమావేశాన్ని 12వ తేది గురువారం మధ్యాహ్నం 3గం.లకు మార్పు చేయడం జరిగిందని సిఎస్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

Also Read : తూర్పు తీరానికి చేరువలో అసని 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular