ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,10,875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 67 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
సెకండ్ ఇయర్ పరీక్షలకు 3,93,757 మంది విద్యార్థులు హాజరుకాగా 3,06,528 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 78 గా ఉంది. ఒకేషనల్ కోర్స్ ఫస్టియర్ పరీక్షకు 38,483 మంది రాయగా, 23,181 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సెకండియర్ పరీక్షలకు 32,339 మంది విద్యార్థులు హాజరవ్వగా 23,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు బాలురు 2,26,240 మంది హాజరవ్వగా, 1,43,688 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 64 శాతం. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు బాలికలు 2,35,033 మంది హాజరవ్వగా… 1,67,187 మంది పాస్ అయ్యారు. 71 శాతం ఉత్తీర్ణత. ఈ ఏడాదీ బాలికలే పైచేయి సాధించారు.
ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 1,88,849 మంది బాలురు హాజరవ్వగా… 1,44,465 మంది పాస్ అయ్యారు. 75 శాతం ఉత్తీర్ణత. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు 2,04,908 మంది హాజరవ్వగా… 1,65,063 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 81 శాతం. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయని బోర్డు కమిషనర్ సౌరభ్ గౌర్ వెల్లడించారు. కాగా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నది. సెకండ్ ప్లేస్ గుంటూరు, థర్డ్ ప్లేస్ లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి.