రాజ్యంగా నిర్మాత అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక దళితులు మాత్రమే ఆరాధిస్తారనొద్దు. అలా అనుకోవడానికి వీల్లేదు. నేటి సమాజంలో దేశంలో ఎన్ని కులాలు మతాలు కలిసి మెలిసి ఉండడానికి నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని చెప్పుకోక తప్పదన్నారు. సిద్ధిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ ,మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్ :
ప్రపంచంలో అత్యంత విగ్రహాలు కలిగిన మహా నేత అంబేద్కర్. విద్య అనేది ఎంత ముఖ్యమో సమాజానికి చాటి చెప్పిన మహానేత అంబేద్కర్ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి స్ఫూర్తినిచ్చిన మహానాయకుడు అంబేద్కర్. 2014-15 లో గురుకులాలు రాష్ట్రంలో 298 మాత్రమే ఉండేవి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని 1,021 కు పెంచారు. 2014లో 1,12,667 మంది విద్యార్థులు మాత్రమే ఉండేది. ఇవాళ గురుకులాల్లో చదువుకునే వారి సంఖ్య 5,40,366 కి పెరిగింది.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషులోనే బోధించడం ప్రారంభించి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య ఇంగ్లీష్ బోధన అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రతి పాఠశాలను బాగు చేసుకోవడం నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విజ్ఞానాన్ని అందించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్, ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించాం. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నేనెప్పుడూ తోడుంటా. ఎల్లవేళలా శాయశక్తులా కష్టపడతానని మంత్రి భరోసా ఇచ్చారు.
ఆ తర్వాత సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో జరిగిన మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యికి మించి ఫించన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి రూ.3016 చొప్పున అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. వికలాంగుల సంక్షేమం కోసం అన్నీ రంగాలలో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగాలకు 4 శాతం, విద్యలో 3 నుంచి 4 శాతం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి వెల్లడించారు.