Sunday, February 23, 2025
HomeTrending Newsమహిళా దినోత్సవ సంబరాలకు తెరాస కార్యాచరణ

మహిళా దినోత్సవ సంబరాలకు తెరాస కార్యాచరణ

International Womens Day :

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా దినోత్సవ సంబరాలకు తెరాస పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ మేరకు పార్టీ శాసన సభ్యులు, జిల్లా అధ్యక్షులతో ఈ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారకరామారావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 6,7,8 తేదీలో మహిళబందు కెసీఆర్… పేరిట సంబరాలు నిర్వహించాలని నిర్ణయించారు. 6 తేదీన సంబరాలు ప్రారంభం అవుతాయని కెసిఆర్ కి రాఖీ కట్టడం, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు ఎఎన్ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవపూర్వక సన్మానం ఉంటుంది. కెసిఆర్ కిట్, షాదీ ముబారక్ థాంక్యూ కెసిఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.

7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం
లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవడం చేయాలి. 8వ తేదీన నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశం, సంబరాలు నిర్వహిస్తారు. ఇంతటి ఘనమైన మహిళా సంక్షేమ మైలురాళ్లను చేరుకున్న నేపథ్యంలో, ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని టిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్