Sunday, March 8, 2026
HomeTrending Newsపోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా

పోలీసు అధికారులకు ఐపీఎస్‌ హోదా

Ap Police Officers : రాష్ట్రంలోని పలువురు పోలీసు అధికారులకు IPS హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం గెజిట్‌ విడుదల చేసింది. ఏపీ పోలీసుశాఖలో ఎస్‌ఐలుగా, డీఎస్పీలుగా చేరిన అధికారుల పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. 2016 నుంచి 2019మధ్యలో పదోన్నతి పొందాల్సిన 23 మంది అధికారుల పేర్లు పంపగా పరిశీలించిన తర్వాత కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 2016లో ఏడుగురు, 2017లో ముగ్గురు, 2018లో ఆరుగురు, 2019లో నలుగురిని ప్యానెల్‌ ఎంపిక చేసింది. అందరికీ ప్రమోషన్‌ లభించగా 2016 ప్యానెల్‌ లోని డొక్కా కోటేశ్వరరావు, 2017 ప్యానెల్‌లోని టి. మోహన్‌ రావు పదవీ విరమణ చేయగా 2017 ప్యానలిస్ట్‌ రామ్‌ ప్రసాద్‌ కొన్ని నెలల క్రితమే కరోనాతో మృతి చెందారు. అయితే 23మందికి పదోన్నతి లభించినా 20మందే ఐపీఎస్‌ హోదా పొంది సేవలందించనున్నారు.

Also Read : జనవరిలో పదిరోజులపాటు వైకుంఠ దర్శనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular