Thursday, March 12, 2026
Homeసినిమాసీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం...

సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం…

ప్రముఖ సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కరోనాతో కవిత కుమారుడు సంజయ్ రూప్ మరణించాడు. గత కొంత కాలంగా సంజయ్ రూప్ కరోనాతో బాధపడుతున్నాడు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న సంజయ్ రూప్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ సంజయ్ రూప్ తుది శ్వాస విడిచాడు. దీనితో కవిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదానికి తోడు కవిత కుటుంబాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేలా మరో కష్టం వచ్చింది. ఆమె భర్త దశరధరాజ్ కి కూడా కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని సమాచారం.

కవితకు ఎదురైన పుత్రశోకానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నటి కవిత 11 ఏళ్ల వయసులోనే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటన మొదలు పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర దిగ్గజాల చిత్రాల్లో కీలక పాత్రల్లో ఆమె నటించారు. హీరోయిన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ రాణించారు. రాజకీయాల్లో ప్రవేశించి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ ఆమెకు సరైన గుర్తింపు లేదని ఆమధ్య భారతీయ జనతా పార్టీలో చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular