Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వీలైనంత త్వరలో స్టాప్ లాక్ గేట్

వీలైనంత త్వరలో స్టాప్ లాక్ గేట్

పులిచింతల ప్రాజెక్టు నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరు లక్షల క్యుసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. దిగువ ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు.  మంత్రి నేటి ఉదయం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు  16వ గేట్ వద్ద ఏర్పడిన సాంకేతిక సమస్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్ విరిగి పోయిందని అధికారులు మంత్రికి వివరించారు.

విరిగిపోయిన గేటు స్థానంలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటుకు చర్యలు ఇప్పటికే ప్రారంభించామని, వీలైనత త్వరలో దాన్ని ఏర్పాటు చేసి నీటి ప్రవాహాన్ని ఆపుతామని మంత్రి అనిల్ వివరించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను కూడా ఉన్నారు.  కాగా, నీటి ఉధృతికి ప్రాజెక్టు దిగువన ఉన్న తమ తండా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని జడపల్లి తండా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్