Thursday, March 12, 2026
Homeసినిమాఉప్పెన భామకు హ్యాట్రిక్ దక్కేనా?

ఉప్పెన భామకు హ్యాట్రిక్ దక్కేనా?

Krithi Shetty: Hat-Trick Movie: ఈ మధ్యకాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో కృతి శెట్టి ఒకరు. ‘ఉప్పెన’ సినిమాతో ఈ బ్యూటీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆమె కళ్లలోని మెరుపుకు .. ఆమె నవ్వులోని విరుపుకు కుర్రాళ్లంతా మనసులు పారేసుకున్నారు. ఆమె చూపుల ధారల్లో అనుభూతులు ఏరేసుకున్నారు. ఆలస్యం చేయడం ఆట్టే మంచిది కాదన్నట్టుగా ఆమె అభిమానుల జాబితాలో చేరిపోయారు. అజంతా శిల్పానికి ప్రాణం వచ్చినట్టుగా కనిపించే ఈ సుందరికి అందం మాత్రమే కాదు .. అంతకి మించిన అదృష్టం ఉండటం విశేషం.

సాధారణంగా హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవడమే కష్టం. అలాంటిది తొలి ప్రయత్నంలోనే ఆమె ‘ఉప్పెన‘తో బ్లాక్ బస్టర్  హిట్ ను అందుకుంది. ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడానికి కారణం ‘బేబమ్మ’నే అనే వారే ఎక్కువ. ఆ సినిమా సక్సెస్ ను మరిచిపోకముందే ఆమె ‘శ్యామ్ సింగ రాయ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన కీర్తి పాత్రకి మంచి మార్కులు దక్కాయి. నాని హీరోగా చేసిన ఈ సినిమా ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూనే హిట్ చిత్రాల జాబితాలో చేరిపోయింది.

ఇక ఇప్పుడు కృతి శెట్టి నుంచి మూడో సినిమాగా ‘బంగార్రాజు’ వచ్చేస్తోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు రానుంది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనుండగా, చైతూ జోడీగా కృతి శెట్టి అందాల సందడి చేయనుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఆమె నాగలక్ష్మి పాత్రలో కనువిందు చేయనుంది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో కృతి శెట్టికి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్స్ రేస్ లోకి ఎంటరైపోయినట్టే!

Also Read :కృతి శెట్టి కున్న భయం ఏమిటి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular