Sunday, January 19, 2025
Homeసినిమాఆ రికార్డును ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందా?

ఆ రికార్డును ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందా?

Records unbeaten: ఆర్ఆర్ఆర్… ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్ర‌మిది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ పై ఫ‌స్ట్ నుంచి భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది వేల‌కు పైగా స్ర్కీన్స్ ల‌లో రిలీజైంది. ఆర్ఆర్ఆర్ విడుద‌ల అవుతుంది అన‌గానే.. అంద‌రిలో ఒక‌టే డౌటు.. బాహుబ‌లి 2 రికార్డును ఆర్ఆర్ఆర్ క్రాస్ చేస్తుందా..?  లేదా..? అని.అయితే.. ఆర్ఆర్ఆర్ మూవీకి ఫ‌స్ట్ నుంచీ డివైడ్ టాక్ ఉంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా సూప‌ర్ అనేలా ఉన్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ ఎంత క‌లెక్ట్ చేయ‌నుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కి ఇటు హైద‌రాబాద్లోనూ, ఇటు ముంబాయిలోనూ భారీగా పార్టీని ఇవ్వ‌డం జ‌రిగింది.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ క‌లెక్ష‌న్స్ అన్ని ఏరియాల్లో త‌గ్గాయి. పైగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన బీస్ట్ విడుద‌ల అయ్యింది. క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ న‌టించిన కేజీఎఫ్ 2 ఈ నెల 14న విడుద‌ల‌. ఈ రెండు చిత్రాల‌తో ఆర్ఆర్ఆర్ క‌లెక్ష‌న్స్ మ‌రింత‌గా త‌గ్గుతాయి. అలాగే చాలా థియేట‌ర్ల‌లో ఆర్ఆర్ఆర్ తీసేసి బీస్ట్, కేజీఎఫ్ 2 చిత్రాలు వేయ‌డం జ‌రిగింది. దీంతో బాహుబ‌లి 2 సెట్ చేసిన 1800 కోట్ల రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ క్రాస్ చేయ‌డం క‌ష్ట‌మే అంటున్నారు సినీ పండితులు. మ‌రి… ఆర్ఆర్ఆర్ ఫుల్ ర‌న్ లో ఎంత క‌లెక్ట్ చేయ‌నుందో చూడాలి.

Also Read : వెయ్యి కోట్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఆర్ఆర్ఆర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్