Wednesday, March 18, 2026
HomeసినిమాShraddha Kapoor: మహేష్‌ కు జంటగా శ్రద్ధా కఫూర్?

Shraddha Kapoor: మహేష్‌ కు జంటగా శ్రద్ధా కఫూర్?

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ తో మూవీ చేయనున్నట్టుగా రాజమౌళి ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజీ, భారీ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ మూవీ కోసం రైటర్ విజయేంద్రప్రసాద్ అదిరిపోయే యాక్షన్ స్టోరీ రెడీ చేశారని సమాచారం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకుండానే ఈ మూవీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆమధ్య ఈ మూవీలో మహేష్ గా జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీపికా పడుకునే కాదు.. మరో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కఫూర్ నటింనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరో వార్త ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకనే ఆ పాత్రను దీపికా కానీ.. శ్రద్ధా కపూర్ కానీ చేస్తే.. బాగుంటుందని అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

అలాగే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ పాత్రను టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్ తో కాకుండా హాలీవుడ్ యాక్టర్ తో చేయించాలి అనుకుంటున్నారట. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో రాజమౌళికి హాలీవుడ్ లో మాంచి క్రేజ్ వచ్చింది. దీంతో మహేష్ తో మూవీని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండే ఈ స్టోరీ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటుందట. అయితే… ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదట. త్వరలోనే నటీనటులను ఫైనల్ చేయనున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular