Saturday, March 14, 2026
HomeసినిమాSalaar: 'సలార్' వాయిదా పడిందా..?

Salaar: ‘సలార్’ వాయిదా పడిందా..?

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేస్తున్నారని ప్రకటించినప్పటి నుంచి సలార్ సినిమా పై అభిమానుల్లోనే కాకుండా కామన్ ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సలార్ వస్తుందా అని ఎదురు చూశారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన తర్వాత అయితే.. అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

సెప్టెంబర్ 28న సలార్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నట్టుగా గతంలో ప్రటించారు. దీంతో ఇక 26 రోజుల్లో సలార్ థియేటర్లోకి వస్తుందని ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు సలార్ షాక్ ఇచ్చిందని.. ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. ఆగష్టు నెలాఖరులో ట్రైలర్ విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. సలార్ రిలీజ్ వాయిదా కారణంగానే ట్రైలర్ రిలీజ్ చేయలేదని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సలార్ మేకర్స్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. సీజీ వర్క్ కంప్లీట్ కాలేదని.. ఇప్పటి వరకు జరిగిన వర్క్ చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ ఇంకా వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యారని ఓ నలభై రోజుల వర్క్ పెండింగ్ ఉందని టాక్. మరి.. సెప్టెంబర్ 28న రాకపోతే ఎప్పుడు వస్తుంది అంటే.. డిసెంబర్ లో సలార్ రిలీజ్ అని ప్రచారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular