Saturday, September 21, 2024
HomeTrending NewsYoga Day:హైదరాబాద్ లో యోగా దినోత్సవ కౌంట్ డౌన్

Yoga Day:హైదరాబాద్ లో యోగా దినోత్సవ కౌంట్ డౌన్

యోగా అనేది ఏ మతానికో .. సంస్కృతికో సంబంధించినది కాదని, ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచేందుకు యోగా ఒక సాధనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో మే 27న 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. ఇందులో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.  ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది కూడా జూన్ 21 తేదీ ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరుకు అనేక దేశాలు అధికారికంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. అనేక కంపెనీల్లో యోగా కోసం ప్రత్యేక ఫ్లోర్స్ కేటాయిస్తున్నారు. ప్రతీ రోజు అక్కడ యోగా చేయడం మనకు గర్వకారణం.
అంతర్జాతీయ యోగా ఉత్సవాన్ని మన దేశంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవం సెకెండ్ ఫేజ్ లో భాగంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశంలోని ప్రతీ గ్రామంలో .. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు జూన్ 21వ తేదీన యోగా కార్యక్రమాన్ని జరుపుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎవరి కోసమో కాదు.. ప్రతీ ఒక్కరి కుటుంబానికి మంచి బాట వేయడానికి ఉపయోగపడుతుంది. తూర్పున ఉన్న ఫిజీ నుంచి పశ్చిమాన ఉన్న సాన్ ఫ్రాన్సిస్కో వరకు అన్ని దేశాల్లో యోగాలో పాల్గోవాలని కోరుకుంటున్నారు. అందుకే జూన్ 21 కి వంద రోజుల ముందు నుంచే అందరిని సిద్ధం చేస్తున్నాం. అన్ని సంస్థలతో కలిసి 100 రోజుల కౌంట్ డౌన్ ఢిల్లీలో ప్రారంభించాం. 75 రోజుల కౌంట్ డౌన్ అస్సాం లో.. 50 రోజుల కౌంట్ డౌన్ రాజస్థాన్ జైపూర్ లో జరిగింది. 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం మే 27న నిర్వహించాలని నిర్ణయించాము. పెరేడ్ గ్రౌండ్స్ లో 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచానికి జూన్ 21న యోగా దినోత్సవం అద్భుతంగా నిర్వహించాలనే సందేశం పంపడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మే 27వ తేదీ ఉదయం 5 గంటలకు పెరేడ్ గ్రౌండ్ లో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి.  ఈ అవకాశం హైదరాబాద్ కు రావడం ఎంతో సంతోషం. 25 రోజుల కౌంట్ డౌన్ కార్యక్రమం హైదరాబాద్ లో పెట్టాలని మోడీ తెలిపారు.
యోగ ఒక మతం, ఒక కల్చర్ కు సంబంధించి అని కొందరు అంటున్నారు. అయితే ఇస్లాం, క్రిస్టియన్ దేశాల్లో యోగా పాటిస్తున్నారు. యోగా ఏ మతానికో సంబంధించి కాదు.. వ్యక్తి మానసిక పరివర్తకు ఇది ఉపయోగపడుతుంది. యోగా చేస్తే డాక్టర్లు, ఆసుపత్రుల అవసరం ఉండదు. యోగా చేస్తే మీకు మీరే డాక్టర్. ” అని అన్నారు కిషన్ రెడ్డి. “గతంలో ఆయుష్ డిపార్ట్ మెంట్ కు ప్రత్యేక శాఖ ఉండేది కాదు. అయితే ప్రధాని మోడీ ఆయుష్ కు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయించారు. కరోనా సమయంలో ఈ యోగా, ఆయుర్వేదం మంచి ఫలితాలు ఇచ్చాయి. దీని కోసమే ఆయుష్  డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనేక దేశాలకు యోగా గురువులను ఆయుష్ డిపార్ట్ పంపింది. ఆయా దేశాల్లో శిక్షకులను తయారు చేస్తోంది. ఆయుష్ మంత్రి సర్వానందం సోనోవాల్  కార్యక్రమంలో పాల్గొంటారు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్, కార్మిక శాఖ మంత్రి ఉపేంద్ర యాదవ్ గారు, ఆయుష్ సహాయ మంత్రి మహేంద్రబాయ్ కూడా పాల్గొంటారని అన్నారు కిషన్ రెడ్డి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్