Saturday, January 18, 2025
Homeసినిమానా కల నెరవేరింది - తమన్నా

నా కల నెరవేరింది – తమన్నా

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్’. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ లో తమన్నా భాటియా కథానాయికగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ల క్రేజీ ప్రాజెక్ట్ జైలర్‌ లో కూడా తమన్నా కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలు జైలర్ ఆగష్టు 10న, భోళా శంకర్ ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రెండు చిత్రాలలో నటించిన హీరోయిన్ తమన్నా విలేకరుల సమావేశంలో సినిమాల విశేషాలని పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…

చిరంజీవి గారితో భోళాశంకర్, రజినీకాంత్ గారితో జైలర్ చిత్రాల్లో నటించడం చాలా ఆనందంగా వుంది. ఈ రెండు సినిమాలు అన్నీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్. వారితో కలసి నటించడంతో నా కల నెరవేరినట్లయింది. సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. ఈ సినిమాలో రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. పాట పేరు కూడా మిల్కీ బ్యూటీ అని పెట్టారు. రియల్లీ క్యూట్. చిరంజీవి గారితో డ్యాన్స్ చేసే అవకాశం రావడం చాలా అదృష్టం. డ్యాన్స్ లో ఇప్పుడు వాడుతున్న చాలా స్టయిల్స్ ఆయన దగ్గర నుంచే వచ్చాయి. భోళా శంకర్ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా.

భోళా శంకర్, వేదాళంకు రీమేక్. అయితే.. మెహర్ రమేష్ గారు చాలా మార్పులు చేశారు. నా పాత్ర కొత్తగా వుంటుంది. నిజానికి నా పాత్ర ఒరిజినల్ లో అంత వుండదు. ఇందులో చాలా డిఫరెంట్ గా క్యారెక్టరైజేషన్ వుంటుంది. జైలర్ విషయానికి వస్తే.. అందులో స్మాల్ పార్ట్ లో కనిపిస్తా. క్యారెక్టర్ పరంగా రెండూ డిఫరెంట్ సినిమాలు. ఆడియో పరంగా జైలర్ లో కావలయ్య పాట చాలా మందికి రీచ్ అయ్యింది. భోళా శంకర్ లో నాది ఫుల్ లెంత్ రోల్. ఈ సినిమాతో చాలా అసోసియేషన్ వుంది.
మెహర్ రమేష్ గారు చాలా క్యాజువల్ గా వుంటారు. ఇందులో నా పాత్రకు హ్యుమర్ వుంటుంది. సెట్స్ లో చాలా జాలీగా గడిచింది. హ్యూమర్, కామెడీని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. మెహర్ గారు హ్యూమర్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. నెక్ట్స్ మూవీస్ గురించి చెప్పాలంటే..  తమిళంలో అరణం అనే సినిమా చేస్తున్నా. మలయాళంలో బాంద్ర సినిమా విడుదలకు సిద్ధమౌతుంది. అలాగే హాట్ స్టార్ లో ఓ వెబ్ సిరిస్ చేస్తున్నాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్