Sunday, January 19, 2025
HomeTrending Newsమంత్రి మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

మంత్రి మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

24 గంటలుగా మల్లారెడ్డి ఇంట్లో కొనసాగుతున్న ఐటీ అధికారుల సోదాలు, షిఫ్ట్స్ వైజ్ గా కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి, అతని కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఆర్పీఎఫ్ బలగాల భారీ బందోబస్తు మధ్య అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.  కర్నాటక, ఒడిస్సాలకు చెందిన దాదాపు 400 మంది అదికారులు 65 బృందాలుగా ఏర్పడి సోదాల్లో పాల్గొంటున్నారు. నిన్న ఉదయం నుంచి జరుపుతున్న సోదాల్లో మల్లారెడ్డి బంధువులు, స్నేహితుల ఇండ్లలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ శాఖ దాడులు ఈ రోజు, రేపు కూడా కొనసాగనున్నాయి. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో అధికారులు ఆయనను సూరారంలోని నారాయణ హృదయాలయకు తరలించారు.

ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడిని చూసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఐటీ అధికారులు అడ్డుకోగా.. మంత్రి మల్లారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. కుమారుడికి అస్వస్థతగా ఉందని తెలిసి ఆస్పత్రికి వెళుతున్నట్లు తెలిపారు. ఇది రాజకీయ కక్షేనంటూ మల్లారెడ్డి తెలిపారు. 2 రోజుల ముందే మల్లారెడ్డి టార్గెట్‌గా ఐటీ అధికారులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల్లా మల్లారెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు చేశారని.. భూమి కొనుగోలుకు బ్లాక్‌మనీ ఇచ్చినా పర్లేదంటూ ఆఫర్‌ చేశారని తెలుస్తోంది. మల్లారెడ్డికి తెలిసిన బ్రోకర్‌ ద్వారా డీల్‌కి వెళ్లి అన్నీ ఆరా..! తీసినట్లు పేర్కొంటున్నారు.  6 నెలలుగా మల్లారెడ్డి, బంధువులు, సంస్థల డైరెక్టర్ల అకౌంట్లపై నిఘా ఉంచారని.. 300 బ్యాంక్ అకౌంట్లను ఐటీ అధికారులు స్టడీ చేసినట్లు పేర్కొంటున్నారు.

Also Read : మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్