Friday, September 20, 2024
Homeసినిమా'భీమా' గోపీచంద్ కి విజయాన్ని అందిస్తుందా..?

‘భీమా’ గోపీచంద్ కి విజయాన్ని అందిస్తుందా..?

గోపీచంద్ హీరోగా ఎ హర్ష దర్శకత్వంలో నటిస్తున్నయూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా నిర్మాత కెకె రాధామోహన్  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా యూనిట్ ఈ చిత్రానికి సంబధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసింది. కాకినాడ, రాజానగరం, అద్దరిపేట బీచ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.

కన్నడలో పలు బ్లాక్‌బస్టర్‌లను అందించిన హర్ష ఈ భారీ బడ్జెట్ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. కుటుంబ భావోద్వేగాలు, ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘భీమా’ రూపొందుతుంది. ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, కిరణ్ ఎడిటర్. అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి వెంకట్, డాక్టర్ రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇటీవల కాలంలో గోపీచంద్ నుంచి సరైన సినిమా రాలేదు. దీంతో భీమా సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. భీమా అయినా విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్