Saturday, November 23, 2024
HomeసినిమాChamdramukhi: 'చంద్రముఖి 2' ఆ స్థాయి మేజిక్ చేసేనా?

Chamdramukhi: ‘చంద్రముఖి 2’ ఆ స్థాయి మేజిక్ చేసేనా?

‘చంద్రముఖి’ కంటే ముందుగా చాలానే దెయ్యం సినిమాలు వచ్చాయి. ఆ సినిమా తరువాత కూడా దెయ్యం సినిమాలు తమ జోరును కొనసాగించాయి. దెయ్యం ఉందని నమ్మించడం .. చనిపోయిన వ్యక్తి దెయ్యంగా మారడానికి బలమైన కారణాన్ని చూపించడం .. తన చావుకి కారణమైన వారిని ఆ ప్రేతాత్మ వెంటాడటం .. ఆ ప్రయత్నంలో ఆడియన్స్ ను భయపెట్టడం .. ఇవి దెయ్యం సినిమాల కాన్సెప్ట్ లో కనిపించే అంశాలు. ఈ లక్షణాలు లేకపోతే దెయ్యం సినిమాలు కనెక్టు కావడం కష్టమే.

మరి ఇన్నేసి దెయ్యం సినిమాలు మనచుట్టూ కనిపిస్తూ ఉంటే, ‘చంద్రముఖి’ సినిమా ఎందుకు అంత ప్రత్యేకంగా నిలిచినట్టు? అనే ఆలోచన చేస్తే, ముందుగా మనకి కనిపించే కారణం సంగీతం. కథాకథనాలు .. నటీనటుల నటన సంగతి అలా ఉంచితే, సంగీతానికి ఎక్కువ మార్కులు ఇవ్వవలసి ఉంటుంది. విద్యాసాగర్ సమకూర్చిన బాణీలు .. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ‘రారా.. ‘ అనే పాట ఈ సినిమాకి ప్రాణంగా నిలిచింది. మూల కథకి ఈ పాటనే మూలంగా నిలిచింది.

ఈ పాటను పక్కన పెట్టేసి ‘చంద్రముఖి’ సినిమాను చూడలేం. ఎందుకంటే కథ మొత్తాన్ని ప్రభావితం చేసింది .. పాత్రల స్వరూప స్వభావాలను ఆవిష్కరించిన పాట ఇది. విడుదలకి ముందే ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఈ పాట కారణమైంది. ఇక ఆ తరువాత స్థానం ‘కొంత కాలం .. కొంతకాలం’ అనే పాటకి దక్కుతుంది. రజనీ – నయనతారపై చిత్రీకరించిన ఈ పాట చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది. కానీ ‘చంద్రముఖి 2’ విషయంలో ఆ స్థాయి మేజిక్ జరుగుతుందా అనేదే చూడాలి. అందుకోసం ఈ నెల 28వ తేదీవరకూ వెయిట్ చేయాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్