Sunday, September 29, 2024
HomeTrending NewsBRS: గులాబి దళంలో ఎన్నికల కోలాహలం

BRS: గులాబి దళంలో ఎన్నికల కోలాహలం

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో కోలాహలం మొదలైంది. కేసీఆర్ చాపకింద నీరులా ప్రచార పర్వాన్ని ముమ్మరం చేశారు. బీఆర్‌ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవితలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. విపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వరుస సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

కేసీఆర్ ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారమే మొదటి జాబితా ​ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా 29 మంది సిట్టింగ్ ​ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో టికెట్ దక్కుతుందో, లేదోనని సిట్టింగ్​ఎమ్మెల్యేల్లో టెన్షన్​ నెలకొంది.

ఆయా స్థానాల్లో అభ్యర్థులను కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలిసింది. వీరిలో ఒకరిద్దరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్సీలు, మరికొందరు ఇతర పార్టీల నేతలతో పాటు పార్టీలోని ఆశావహులు ఉన్నట్టు సమాచారం. జనగామలో ముత్తిరెడ్డిని తప్పించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి చాన్స్ ఇస్తారని, స్వయంగా కేసీఆరే ఆయనను జనగామకు వెళ్లి పని చేసుకోవాలని సూచించారని ప్రచారం జరుగుతోంది. స్టేషన్​ఘన్‌పూర్‌లో రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి చాన్స్ ఇవ్వొచ్చన్న ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్​లో చేరిన 12 మందికి టికెట్ ఇస్తానని​ హామీ ఇచ్చారు. కొత్తగూడెంలో వనమాపై ఉన్న డైలమా సైతం తొలగిపోయిందని, ఆయనే ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టును తొలుత ఈ నెల 18న ప్రకటించాలనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి జాబితాలో లక్కీ నెంబర్ 6 కలిసొచ్చేలా 51 మంది పేర్లతో రూపొందించింది. ఈ స్థానాలన్నీ దాదాపుగా సిట్టింగ్‌లకే కట్టబెట్టింది. అన్ని పార్టీలకంటే ముందుగానే జాబితాను ప్రకటించాలనుకున్న బీఆర్ఎస్ వివాదాలు లేని స్థానాలను చేర్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్