వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
కొద్దిసేపటి క్రితం తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. మూడురోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 20 రోజులు సభ నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేయగా ప్రభుత్వం సమ్మతించలేదు. ఈ సమావేశాల్లో భారీ వర్షాలు, వరదలు ప్రభుత్వ సహాయం పై చర్చించనున్నారు. ఈ దఫా సమావేశాల్లో దాదాపు పది బిల్లులను ప్రవేశ పెట్టనున్న సర్కార్… వాటికీ ఆమోద ముద్ర ముద్ర వేయించుకునే అవకాశం ఉంది.