Sunday, January 19, 2025
Homeసినిమాగ్లామర్ రోల్స్ చేయడం అంత వీజీ కాదు

గ్లామర్ రోల్స్ చేయడం అంత వీజీ కాదు

అనుపమ పరమేశ్వరన్ .. ఎక్కడి అమ్మాయి అని ఎవరూ ఆలోచన చేయలేదు. పద్ధతిగా కనిపిస్తుంది .. చాలా బాగా యాక్ట్ చేస్తుంది అనే అంతా అనుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆమెను ఓన్ చేసుకున్నారు. గ్లామర్ రోల్స్ చేయకపోవడం వల్లనే ఆమెకి ఆశించినస్థాయిలో అవకాశాలు రావడం లేదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తూనే ఉంటాయి. ఆమె కూడా అదే అనుకుందేమో .. ఈ సారి గ్లామర్ డోస్ కాస్త పెంచాలనే అనుకుంది. ఆ పని కాస్త ‘టిల్లు స్క్వైర్’ సినిమాతో చేసేసింది. ఈ సినిమాకి నుంచి వచ్చిన ఆమె పోస్టర్స్ చూసి చాలామంది షాక్ అయ్యారు.

నిజానికి కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ చేయాలని అభిమానులు కోరుకుంటారు. మరికొంతమంది హీరోయిన్స్ పద్ధతిగా కనిపిస్తేనే బెటర్ అనుకుంటారు. ఇదే మాట అనుపమ ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. కానీ కెరియర్ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే కొన్ని తప్పదు. పైగా మనం మడిగట్టుకుని కూర్చుంటే మహా సంగ్రామమేదీ ఆగిపోదు. అందుకేనేమో తన స్థాయిని దాటేసి ఈ సినిమాలో అనుపమ అందాల ప్రదర్శన చేసింది. ఒక కొత్త హీరోయిన్ మాదిరిగా దూకుడు చూపించింది. కాకపోతే గ్లామరెస్ రోల్స్ చేయడం అంతే ఈజీ కాదని తేల్చిపారేసింది.

“అందంగా కనిపించడం అనుకున్నంత తేలికేం కాదు. కొన్ని రకాల కాస్ట్యూమ్స్ వేసుకుని సెట్లో అంతమంది ముందు నిలబడటమే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక కొన్ని రకాల కాస్ట్యూమ్స్ పైకి చూడటానికి చాలా బాగుంటాయి. కానీ వాటికి సంబంధించిన డిజైన్స్ గీసుకుపోతూ ఉంటాయి. ఆ చిరాకును భరిస్తూ నటించడం అంత తేలికేం కాదనే విషయం నాకు కూడా ఇప్పుడే అర్థమైంది” అంటూ మనసులో మాట చెప్పింది. తన ఇమేజ్ కి భిన్నంగా ఆమె చేసిన ఈ గ్లామర్ రోల్ ఎన్ని మార్కులు తెచ్చిపెడుతుందో చూడాలి మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్