Sunday, January 19, 2025
Homeసినిమాకమల్‌హాసన్‌ 'KH234' సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్, త్రిష

కమల్‌హాసన్‌ ‘KH234’ సినిమాలో దుల్క‌ర్ స‌ల్మాన్, త్రిష

కమల్‌హాసన్‌, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ 1987 చిత్రం ఓ క్లాసిక్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇక దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుంది. ‘KH234’ వ‌ర్కింగ్ టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమా రీసెంట్‌గా లాంచ్ అయ్యింది. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ పతాకాలపై కమల్‌హాసన్‌, మణిరత్నం, ఆర్‌.మహేంద్రన్‌, శివ అనంత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ. ఆర్. రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఇదిలా ఉంటే..

తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్‌ను ఇచ్చారు.ఇప్పటికే త్రిష ఈ మూవీ కాస్ట్‌లో భాగం అవగా.. తాజాగా దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా చేరారు. ఈ సినిమాలో దుల్క‌ర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మేకర్స్‌ దుల్క‌ర్ స‌ల్మాన్ ఈ సినిమాలో భాగమైనట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్