రాజకీయలబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయన స్వయంగా వాదన వినిపించినట్లు తెలిసింది. రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా తనపై కేసు నమోదు చేయడం చట్ట విరుద్దమని, స్కిల్ డెవలప్‍మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఆయన వాదించారు. స్కిల్ డెవలప్‍మెంట్‍కు 2015-16 బడ్జెట్ లో పొందుపర్చామని, దీనికి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిందని, – అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. 2021 డిసెంబర్ 9న నమోదు చేసిన ఎఫ్‍ఐఆర్ లో రిమాండ్ రిపోర్టులో తన పాత్ర ఉందని సీఐడీ పేర్కొనలేదని చెప్పారు.