Tuesday, March 10, 2026
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ట్రయాంగిల్ బిజినెస్ స్టొరీ: కేశినేని

ట్రయాంగిల్ బిజినెస్ స్టొరీ: కేశినేని

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసియార్, వైఎస్ షర్మిల.. ముగ్గురిదీ ట్రయాంగిల్ బిజినెస్ స్టొరీ అని విజయవాడ ఎంపి, తెలుగుదేశం నేత కేశినేని నాని అభివర్ణించారు. రెండు రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం ముగ్గురూ కలిసి నాటకం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. కృష్ణాజలాల విషయంలో కేసిఆర్ కు జగన్ దాసోహం అయ్యారని, ఈ విషయం ప్రజలకు కూడా అర్ధమైందని చెప్పారు.

జగన్ కు హైదరాబాద్ లో ఆస్తులు, పెట్టుబడులు ఉన్నాయని, వాటిని కాపాడుకోవడం కోసమే కెసియార్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కూడా జగన్ కు కేసియార్ సాయం చేశారని, ఇది బహిరంగ రహస్యమేనని చెప్పారు.  కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం జగన్, వైఎస్సార్సీపీలు పోరాడాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular