Tuesday, March 10, 2026
Homeసినిమాకృతి శెట్టి .. శ్రీలీల తరువాత 'లవ్ టుడే' బ్యూటీనే!

కృతి శెట్టి .. శ్రీలీల తరువాత ‘లవ్ టుడే’ బ్యూటీనే!

టాలీవుడ్ కి పరిచయమైన అందమైన కథానాయికలలో .. ఇక్కడి తెరపై తమ జోరును  కొనసాగిస్తున్న కథానాయికలలో కేరళ బ్యూటీలే ఎక్కువ. అక్కడి వాళ్లంతా దాదాపు మలయాళ సినిమాలతోనే తమ కెరియర్ ను మొదలుపెడతారు. మలయాళ ప్రేక్షకులు కథల్లోను .. పాత్రల రూపకల్పనలోను సహజత్వాన్ని చూస్తారు. అందువలన నటన పరంగా కూడా అక్కడి కథానాయికలకు వంకబెట్ట వలసిన అవసరం ఉండదు.

అందం …  అభినయం ఉన్న హీరోయిన్స్ ను టాలీవుడ్ ప్రేక్షకులు వదులుకోరు. వచ్చి రావడంతోనే ఆమోద ముద్ర వేసి వాళ్లను  స్టార్స్ కేటగిరిలోకి చేర్చేస్తారు. అలాంటి జాబితాలోకి అడుగుపెట్టే బ్యూటీగా ఇప్పుడు ‘ఇవాన’ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘లవ్ టుడే’ అనే తమిళ అనువాదంతో ఇటీవలే ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది. ఇప్పుడు కుర్రాళ్లంతా ఈ సుందరి గురించే మాట్లాడుకుంటున్నారు. తమ హార్ట్ వాల్ పై ఆమె పోస్టర్ ను అంటించేశారు.

ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి వచ్చినవారిలో కృతి శెట్టి – శ్రీలీల జోరు కొనసాగుతోంది. ఈ ఇద్దరి తరువాత స్థానంలో నిలదొక్కుకోవటానికి కేతిక శర్మ ప్రయత్నించింది కానీ కుదరలేదు. ఆ స్థానంలో ‘ఇవాన‘ నిలబడే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. రామ్ .. నితిన్ .. నిఖిల్ .. వంటి హీరోలతో పాటు ఆ తరువాత వరుసలో ఉన్న హీరోలంతా తమ నెక్స్ట్ ప్రాజెక్టులో ఈ బ్యూటీ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఇక కోలీవుడ్ లో కూడా ఈ కోమలి డేట్స్ కోసం ట్రైచేసే వారి సంఖ్య పెరిగిపోయిందని టాక్. మరి ఇవాన ఎంతవరకూ టాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుందనేది చూడాలి

Also Read : యూత్ లో ఆసక్తిని పెంచుతున్న’లవ్ టుడే’   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular