Tuesday, March 10, 2026
Homeసినిమా‘జాతీయ రహదారి’ లిరికల్ సాంగ్ విడుదల చేసిన యండమూరి

‘జాతీయ రహదారి’ లిరికల్ సాంగ్ విడుదల చేసిన యండమూరి

భీమవరం టాకీస్ పతాకంపై మధు చిట్టె, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, నటీనటులుగా నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘జాతీయ రహదారి’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ నెల 10 న ప్రపంచ వ్యాప్తంగా  200 థియేటర్స్ లో విడుదల కు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత దర్శకుడు యండమూరి వీరేంద్రనాధ్ చేతుల మీదుగా  ఈ సినిమా లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

యండమూరి మాట్లాడుతూ.. దర్శకుడు నరసింహ నంది ప్రతిభ కలిగిన దర్శకుడు. ఆయన నేషనల్ అవార్డ్ గ్రహీత. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు.

నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ… నాకు ఎంతో  ఇష్టమైన యండమూరి చేతులు మీదుగా ఈ సాంగ్ విడుదల చేయటం ఆనందంగా ఉంది. నరసింహ నంది అద్భుతమైన దర్శకుడు. అతనిని నమ్మి దర్శక భాద్యతలు అప్పగించాను దానికి 100% న్యాయం చేశారు. ఈ సినిమా హిట్ అతని ఖాతాలోకి వెళుతుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular