Sunday, January 19, 2025
HomeTrending Newsపులివెందులలో జగన్, తాడేపల్లిలో బాబు

పులివెందులలో జగన్, తాడేపల్లిలో బాబు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్  ప్రజల స్పందనతో ఉత్సాహంగా మొదలైంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురం పోలింగ్ బూత్ లో సతీమణి భారతి, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా ఉపయోగించుకోవాలని జగన్ కోరారు. ఐదేళ్లుగా తమ  ప్రభుత్వం చేసిన మంచిని అంతా చూశారని, ప్రభుత్వంలో  లబ్ధి పొందారని  భావిస్తే మన తమకు ఓటు వేయాలని, అది  పేదల భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తుందని విజ్ఞప్తి చేశారు.

మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఉండవల్లి గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు. ప్రతి ఒక్కరూ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, సుపరిపాలన కోసం, మంచి భవిష్యత్తు కోసం ఓటు వేయడం బాధ్యత అని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ పట్ల ఇంతటి స్పందన తన ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో తొలిసారి చూస్తున్నానని, గతంలో ఎప్పుడూ చూడలేదని సంతోషం వ్యక్తం చేశారు. ఓటు హక్కు కోసం అమెరికా, ఇతర దేశాల నుంచే కాకుండా ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారని…. కూరగాయలు అమ్మేవాళ్ళు, కార్మికులు కూడా సొంత ఖర్చులు పెట్టుకొని ఓటు వేయడం కోసం వచ్చారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్