శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేతలు నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. వైసీపీ, టిడిపి, జన సేన అధినేతలు వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగన్, ఆయన భార్య భారతి… పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద మేమంతా సిద్ధం యాత్ర క్యాంపులో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.
***


టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం చేశారు. పార్టీ నేతలు, కార్యక్తలు ఈ వేడుకలకు హాజరయ్యారు.
***


పిఠాపురం నియోజక వర్గం చేబ్రోలులోని నివాస గృహంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజక వర్గం టిడిపి ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంఛార్జి కృష్ణం రాజు, నాగబాబు, తదితరులు కూడా పాల్గొన్నారు