Thursday, March 12, 2026
HomeTrending Newsఆంధ్రా ఎలన్ మస్క్ జగన్ : సోమిరెడ్డి

ఆంధ్రా ఎలన్ మస్క్ జగన్ : సోమిరెడ్డి

వైఎస్ జగన్ ఇంకా ఓటమి నుంచి తెరుకోలేదని, ఈవీఎంలపై ఓటమి నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టాలంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ పై సోమిరెడ్డి స్పందించారు.

@ysjagan ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..ఏపీ ఎలన్ మస్క్ లా జగన్ మాట్లాడుతున్నాడు..గెలిస్తే తన గొప్ప..ఓడితే ఈవీఎంల తప్పా..? 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడాడో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి.. పరనింద..ఆత్మ స్తుతి మాని ఇకనైనా జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలి” అంటూ ట్వీట్ చేశారు.

ఈవీఎంలపై జగన్ రాద్దాంతం చేస్తున్నారని, గత ఎన్నికల్లో వాటిని అద్భుతమని జగన్ చెప్పలేదా అంటూ విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ప్రశ్నించారు. ఓటమిలో ఆయన తప్పును ఒప్పుకోలేక ఆ నెపాన్ని ఈవీఎంలపై నెడుతున్నారని ఎద్దేవా చేశారు.  జగన్ పాలన వద్దంటూ ప్రజలు గుణపాఠం చెప్పారని, ఎన్నికలకు ముందు విశాఖ భవంతుల అంశం బైటకు వస్తే కనీసం ఆ 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావని స్పష్టం చేశారు.  జగన్ జీవితమే అబద్ధాలు, మోసాల మయమని, ఆయన అవినీతి సొమ్ము కక్కిస్తామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular