Saturday, January 18, 2025
HomeTrending Newsసమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు: జగన్

సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు: జగన్

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 మే 30న జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. నాటి ఎన్నికల కౌంటింగ్ మే 23న జరిగింది. వారంరోజుల తరువాత ౩౦న ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా  వైయస్ జగన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.  ప్రజలందరూ దీవెనలతో మళ్లీ మన ప్రభుత్వమే ఏర్పాటు అవుతుందంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

“దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది” అంటూ పోస్ట్ చేశారు. నాటి ప్రమాణ స్వీకారం చేసిన ఫోటోను షేర్ చేశారు.

కాగా, ఈ ఎన్నికల పోలింగ్ మే 13 న పూర్తి కాగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్