Saturday, September 21, 2024
HomeTrending Newsమా సూపర్ సిక్స్ ఆంధ్రా భోజనం- సీమ సంకటి: లోకేష్

మా సూపర్ సిక్స్ ఆంధ్రా భోజనం- సీమ సంకటి: లోకేష్

చంద్రబాబు హయంలో విశాఖపట్నం మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ఉంటే జగన్ పాలనలో విషాదపట్నంగా మారిందని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తమ పాలనలో రోజుకో కంపెనీ చొప్పున ఐటి, మెడికల్ డివైజస్, బ్యాంకింగ్ సెక్టార్ కంపెనీలు వస్తే ఇప్పుడు భూ కభ్జాలు, దోపిడీలు, కిడ్నాప్ లు జరుగుతున్నాయని విమర్శించారు. ఉత్తరాంధ్రలో శంఖారావం నిర్వహిస్తున్న లోకేష్ నేడు అనకాపల్లి జిల్లా పెందుర్తిలో జరిగిన  బహిరంగసభలో ప్రసంగించారు.

పేద ప్రజల కష్టాలు చూసి, తెలుగింటి ఆడపడుచుల కన్నీళ్లు తుడిచేందుకే తాము సూపర్ సిక్స్ తీసుకువచ్చామని చెప్పారు. బాబు ప్రకటించిన సూపర్ సిక్స్ ఆంధ్రా భోజనం- రాయలసీమ రాగి సంకటి లాంటిదని అభివర్ణించారు. అలాంటి పవిత్రమైన ఈ పథకాలను వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. వైసీపీకి ఎంపి అభ్యర్ధులు లేక పక్క జిల్లాలనుంచి ట్రాన్స్ ఫర్ చేసుకుంటున్నారని, విశాఖకు పక్క జిల్లానుంచి ఓ తల్లిని తీసుకొచ్చారని, ఒంగోలుకు చిత్తూరు నుంచి చేవిరేద్దిని, నరసరావుపేటకు అనిల్ ను పోటీకి దించుతున్నారని ఎద్దేవా చేశారు. 175 స్థానాల్లో 75 చోట్ల పోటీ చేయడానికి అభ్యర్ధులు లేక జగన్ ఇబ్బంది పడుతున్నారన్నారు.

జగన్ ఇప్పటి వరకూ 62 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేస్తే వారిలో ఎక్కువ శాతం బిసిలు, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని, తన సొంత సామాజికవర్గానికి చెందినవారు ఎవరూ లేరని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో బిసిలకు న్యాయం చేసే ఆలోచన లేదని.. ఈ విషయాన్ని ఆ పార్టీ బిసి సెల్ అద్యక్షుడు జంగా కృష్ణమూర్తి స్వయంగా చెప్పారని.. పార్థసారథి, ఆర్థర్, ఎలీజా లాంటి నేతలు పార్టీలో జరిగిన అన్యాయం ఏమిటో చెప్పారని లోకేష్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్