గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ కు దక్కుతుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్ అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ద్వారా ‘జగనన్న చెప్పాడంటే – చేస్తాడంతే’ అన్న మాటను మరోసారి రుజువు చేసుకున్నారని కొనియాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా నేడు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని టీ సర్కిల్‌లో ఉద్యోగుల సంఘాల నేతలు,కాంట్రాక్టు లెక్చరర్లు ఏర్పాటు చేసిన కృతజ్ఞతా ర్యాలీలో మంత్రి పాల్గొని వారితో పాటు కేక్ కట్ చేసి సిఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా జగన్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు ఉద్యోగులతో రాజకీయాలు మాత్రమే చేశారు కానీ వారికోసం ఎలాంటి మేలూ చేయలేదన్నారు. సిపీఎస్ స్థానంలో జీపీఎస్ ను తీసుకొచ్చి ఉగ్యోగులకు ఎలాంటి నష్టం లేకుండా జగన్ చూశారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘాల నేతలు,కాంట్రాక్టు లెక్చరర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు,