చంద్రబాబు అరెస్టుకు జగన్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు. బంద్‌ను విజయవంతం చేసిన కార్యకర్తలకు, మద్దతు తెలిపిన పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజమండ్రిలో లోకేష్ మీడియాతో మాట్లాడిన ముఖ్యాంశాలు…
- ప్రతిక్షణం అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు
- కోడి కత్తి కేసులో ఎంత అబద్ధం ఉందో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా అంతే అబద్ధం
- జగన్‌కు అధికారం అంటే ఏమిటో తెలియదు
- చంద్రబాబుపై అవినీతి మరక వేసే ప్రయత్నం చేశారు. అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదు
- దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు
- బాబాయ్ హత్య కేసులో అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే.. కర్నూలులో పోలీసులకు అడ్డుపెట్టి సైకో జగన్ అడ్డుకున్నాడు
- జగన్ దృష్టిలో అధికారం అంటే కక్ష సాధింపుల
- స్కిల్ డెవలప్‌మెంట్‌లో 42 సెంటర్లు ప్రారంభించి 2.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం
- స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు అనుమతించింది అజయ్‌కల్లంరెడ్డి.. కానీ వారిపై కేసులు పెట్టలేదు
- గత 2 ఏళ్లలో ఒక్క ఛార్జిషీట్ వేయలేకపోయింది
- చంద్రబాబుకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో నిరూపించగలరా?
- చంద్రబాబు డబ్బులు తీసుకున్నట్లు ఎక్కాడా నిరూపితం కాలేదు
- తప్పు జరగలేదు కాబట్టే నిరూపించలేకపోయారు
- విపక్షాలపై జగన్ దొంగ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారు
- నా పోరాటం ఆగదు.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి
- నేను రాజమండ్రిలోనే ఉన్నా.. ఎక్కడికీ పారిపోలేదు
- నన్ను అరెస్టు చేయాలనుకుంటే వచ్చి చేసుకోండి
- నేను వదిలి పెట్టను.. ప్రజల్లోకి వెళ్తా. నేను ఈ ప్రభుత్వాన్ని వెంటాడతాను
- పాముకు తలలోనే విషం ఉంటుంది.. జగన్‌కు ఒళ్లంతా విషమే
- నేను అన్నగా భావించే పవన్ కల్యాణ్ నాకు అండగా నిలబడతారు
- నాకున్న కార్యకర్తలు, నాయకులు నాకు అండగా నిలబడతారు
- జగన్‌పై 10 సీబీఐ, 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులున్నాయి
- జగన్‌పై కేసులు పదేళ్లుగా ట్రయల్‌కు కూడా రావడం లేదు
- వ్యవస్థలను ఎంతగా మేనేజ్ చేస్తున్నారో అర్థం అవుతోంది
- దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు
- చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బిల్‌గేట్స్, క్లింటన్, ఫార్చూన్ సీఈవోలూ చెబుతారు
- అలాంటి వ్యక్తిపై దొంగకేసు పెట్టి జైలుకు పంపింది సైకో జగన్ ప్రభుత్వం
- పోలీసులకు చెడ్డ పేరు వచ్చేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది
- శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే అడ్డుకుంటారా?
- పోలీసులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది
- మా న్యాయ పోరాటం కొనసాగుతుంది