Thursday, March 27, 2025
HomeTrending Newsఅకాడమీ పేరు మార్పులో తప్పేమిటి?

అకాడమీ పేరు మార్పులో తప్పేమిటి?

తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మార్చి విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని అకాడమి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మి పార్వతి కోరారు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటును తప్పు పడుతూ కొందరు మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు చూశానని, నష్టం ఏమిటో చెప్పకుండా ఏదో ఘోరం జరిగిపోయినట్లు ఎందుకు ప్రకటనలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా సిఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజానికి అందరూ అభినందించవలసిన విషయమన్నారు. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని లక్ష్మీపార్వతి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్